Home / ANDHRAPRADESH / రాజన్న చదివిస్తే..జగన్ అన్న ఉద్యోగం ఇచ్చారు.. గ్రామ సచివాలయ ఉద్యోగుల భావోద్వేగం…!

రాజన్న చదివిస్తే..జగన్ అన్న ఉద్యోగం ఇచ్చారు.. గ్రామ సచివాలయ ఉద్యోగుల భావోద్వేగం…!

ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు లక్షన్నర గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలని, ప్రతీ పేదవాడి ముఖంలోనూ చిరునవ్వును చూడాలని కోరారు. కాగా గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో అర్హత సాధించి ఈ రోజు సీఎం జగన్ చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. స్వయంగా సీఎం జగన్‌ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల చదువుకున్నామని, ఇప్పుడు ఆయన తనయుడు జగనన్న తమకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశంసించారు. అవినీతి రహిత పాలనకు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీయే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ఫీజురీయింబర్స్‌మెంట్ పథకంలో ఎందరో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఏపీ, తెలంగాణలోని పేద, మధ్యతరగతికి కుటుంబాలకు చెందిన ఎందరో పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే…అదీ వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లనే. అయితే గత ఐదేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. అంతే కాకుండా యువతకు ఒక్క జాబు కూడా ఇవ్వలేదు. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాజన్న తనయుడు జగన్ లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ స్వయంగా నియామకపత్రాలు అందజేయడంతో యువతీ, యువకులు భావోద్వేగానికి గురయ్యారు. అప్పుడు రాజన్న చదివించాడు..ఇప్పుడు రాజన్న తనయుడు జగన్‌అన్న ఉద్యోగాలు ఇచ్చాడంటూ యువత సంబురపడుతుంది. నిజమే కాదు..యువత కలలు నిజం చేసిన సీఎం జగన్ నిజంగా అభినందనీయుడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat