టీటీడీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి. ఏ కుటుంబానికి దక్కని ఈ గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కనుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడు తండ్రీకొడుకులు స్వామివారికి పట్టువస్త్రాలు ఇవ్వడం జరగనేలేదు. ఆ స్వామివారి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి. ఇక వైఎస్ కుటుంబానికి స్వామివారంటే అపారమైన నమ్మకం.
తండ్రి బాటలోనే తనయుడు నడుచుకుంటున్నాడు. తాను ప్రజాసంకల్పయత్ర మొదలుపెట్టినప్పుడు ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్న జగన్ పాదయాత్ర పూర్తయిన అనంతరం కాలినడకన వెళ్లి మరోసారి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా స్వామి ఆశీస్సులు తీసుకున్నారు జగన్. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు తిరుమల లోని బేడి హనుమాన్ ఆలయం నుండి స్వామివారి శేషవస్త్రంతో వరివట్టం కట్టుకొని మేళతాళాల మధ్య ముందుకు సాగుతూ ఆలయం లోపల గర్భగుడిలోని మూలవిరాట్టు ముందు అర్చకులకి, అధికారులకి అందజేయనున్నాడు.