గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడంపై హీరో రాజశేఖర్ మరోసారి స్పందించారు. తన చిత్రం ‘గరుడవేగ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన, ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు తనంటే చాలా కోపమని అన్నాడు. ఆ కోపాన్ని గబ్బర్ సింగ్ చిత్రంలో సన్నివేశం ద్వారా తీర్చుకున్నాడని అన్నాడు. “ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే… అందులో అన్నీ ఓకే, కానీ చివరిలో తిడుతూ డ్యాన్స్ చేయిస్తారు… ఆ తరువాత ఏం చేస్తిరి… ఏం చేస్తిరి.. ఏంటి అని, ఆలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపించారు… ఏంట్రా… చూస్కో అన్నట్టు, నాకు వార్నింగ్ ఇచ్చినట్టు, నన్ను తిట్టినట్టు చేశారు. నాకు అదే బాధ కలిగింది.
ప్రజారాజ్యం పార్టీ… అందులో విషయాలు… ఆయన గురించి జరిగిన విషయాలు నేను చెప్పాను. అదే ఆయనకు నాపై కోపం అనుకుంటానని అన్నాడు. అలాగే 1990వ దశకంలో తాను నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతుంటే, తను ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు అణగదొక్కే ప్రయత్నం చేశారని రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “కొన్ని ఉంటాయి. కొంతమంది… నేను ఎదిగితే వాళ్లకు కాంపిటేటివ్ అవుతాను అనుకున్నారు. అందువల్ల నన్ను తొక్కేశారని అనుకోవచ్చు… లేదు అది జరిగివుండవచ్చు. జరిగింది కూడా. ఎంతో మంది కథానాయికలను నాతో నటించవద్దని సలహా ఇచ్చినవాళ్లు ఉన్నారు.
ఎంతో మంది దర్శకులకు నాతో సినిమా చేయవద్దని చెప్పిన వాళ్లు ఉన్నారు. ప్రతిభావంతులను ఎవరూ తొక్కేయలేదు. దీన్ని ఎవరూ మూసేయలేరని వ్యాఖ్యానించారు. సహనం, ఓర్పు తన భార్యకు ఉన్న సద్గుణాలని, అవే తనను ఎన్నోమార్లు కాపాడాయని అన్నాడు. తన కుమార్తె శివానీ సినీ రంగ ప్రవేశంపై కూడా రాజశేఖర్ మరింత వివరణ ఇచ్చాడు. శివానీకి సినిమాల్లో నటించడమంటే ఇష్టమని, తొలి సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని అన్నాడు. ఆ అమ్మాయికి కూడా నాలాంటి కోరికలే ఉన్నాయి. మంచి కథలు చేయాలి. ఆకతాయిగా ఉన్న సబ్జెక్ట్ చేయకూడదని భావిస్తుందని తెలిపారు.
కొన్ని కథలు వింటూ ఉంది. ఒకటి రెండు మేము కూడా అనుకుంటున్నాం. కొన్ని నచ్చాయి. ఏది ఫస్ట్, ఏది సెకండ్, థర్డ్ అన్నది తెలియదుగానీ, రెండు మూడు నెలల్లో తెలుస్తుందని అన్నాడు. తన బిడ్డ సినీ రంగ ప్రవేశం ఖాయమేనని, ఆ విషయాలన్నీ తనకన్నా జీవితకు బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు.