తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం 589అడుగుల నీరు వచ్చి చేరిందని అధికారులు అంటున్నారు.
Tags andhrapradesh heavy rains level nagarjuna sagar project slider telangana water