ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న చిత్రం రామాయణ. సుమారు 500కోట్లు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ మరియు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఈ చిత్రంలో సీత పాత్రలో శ్రద్దకాపూర్ ను నటించమని అడిగారట. దీనికి ఆమె 12కోట్లు అడిగిందని సమాచారం. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అల్లు అరవింద్ వేరే హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక శ్రద్ధా తెలుగులో మరో త్రిల్లర్ డ్రామా చిత్రం సాహో ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో అంతగా ఆడనప్పటికీ హిందీలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కూడా కాళీగా లేవట. ఇక అల్లు అరవింద్ రావణుడి పాత్రకోసం ప్రభాస్ ను కలిసినట్టు తెలుస్తుంది.