వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ మంచి పనిపట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా విజయవాడలో ఉదయాన్నే ఓ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ సందర్భంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ ప్రమాదం చూశారు.. పెదకాకాని వద్ద అటుగా వెళుతున్న బైక్ టైర్ పగలడంతో ఆ బైక్ అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది..
దాంతో సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం అయ్యి కొట్టుమిట్టాడుతున్నారు. వెంటనే వారిని గమనించి తన కారు ఆపి ఉండవల్లి శ్రీదేవి పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్స్ కు వెంటనే ఫోన్ చేసి తనకు వైద్యవృత్తి తెలిసి ఉండడంతో తానే వైద్యం చేసి స్వయంగా అంబులెన్స్ లో పంపించారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం, ఎమ్మెల్యే బాధ్యత తో చేసిన ఈ పనికి అందరు అని మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తున్నాను.