ఉండవల్లిలోని నదిలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోంది. వాస్తవానికి కరకట్టపైన అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసముంటున్నలింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులిచ్చారు. ఈ అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఈ వీడియోలు, ఫొటోలతో చంద్రబాబు ఇంటిని కూల్చేస్తున్నట్లుగా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. అక్రమ నిర్మాణాల తొలగింపు కృష్ణనది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇప్పటికే సీఆర్‌డీఏ అధికారులు నోటీసులిచ్చారు.
ఈ క్రమంలోనే సీఆర్‌డీఏ సిబ్బంది అక్రమ నిర్మాణల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ పాతూరి కోటేశ్వరరావు అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తోంది అంతేకానీ చంద్రబాబు ఇల్లు కూల్చివేస్తున్నామన్నది అవాస్తవమన్నారు. ప్రతిపక్ష నేత ఇల్లు కూల్చివేత అని ప్రచారం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదని కరకట్ట నిర్మాణాలకు గతంలో ఇచ్చింది చివరి నోటీసులని స్పష్టంచేశారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసలు అక్కడ ఉండొచ్చా అని ప్రశ్నించారు. పూలింగ్ అక్కడివరకూ వచ్చి ఎందుకు ఆగిందని ప్రశ్నించారు.. నిర్మాణాలు సక్రమమైతే కోర్టుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు ఇల్లే కాదు కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామన్నారు.