కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సైరా ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇండస్ట్రీ దిగ్గజాలు చాలా మంది హాజరయ్యారు. వేలాది మంది మెగాభిమానులు వచ్చారు. అయితే ఈ వేదికపై అసలు సిసలు గ్లామర్ మిస్సయ్యింది. హీరోయిన్ మిస్సింగ్ వల్ల వేదిక కళ తప్పినట్టే అనిపించింది. అంతమంది ఉన్నా అందాల భామల లేకపోవడంతో కళ తప్పింది. ఇంత పెద్ద ఈవెంట్ కి కనీస మాత్రంగా ఎవరో ఒకరు ఉండి ఉంటే బావుండేదనే అభిప్రాయం అభిమానుల్లో వినిపించింది. నయనతార.. తమన్నా ఎక్కడ? ఆ ఇద్దరూ ఈ వేదికపై సందడి చేస్తారని భావిస్తే ఇలా హ్యాండిచ్చారేందుకు? అంటూ సోషల్ మీడియాలో ట్నోలం చేస్తున్నారు. ఇతం పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే కనీసం తమన్నా అయినా కనిపించలేదు ఎందుకో…కావాలనే డుమ్మకొట్టారా? అసలేం జరిగిందో తెలియాల్సి ఉంది.
