తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్,బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర బీజేపీ,కాంగ్రెస్ నేతల తీరు ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు.
గత ఐదేండ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వారంతటా వారే వచ్చి మా పార్టీలో చేరారు. మేము ఏనాడు కూడా వాళ్లను రమ్మనలేదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ఆ పార్టీఎమ్మెల్యేలను చేర్చుకున్నామని”అన్నారు.
అయితే ఏపీ టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. కండువాలు కప్పుకున్న రోజునే వాళ్లు ప్రధానమంత్రి మోదీని కలిశారన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలుపుకుంది బీజేపీ. ఇంకోవైపు రాజస్థాన్ లో బీఎస్పీ తమ పార్టీలో విలీనం చేసుకుంది కాంగ్రెస్ అని విరుచుకుపడ్డారు.