సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్‌షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన జే ట్యాక్స్ బాగోతం బయటపడింది. భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, మైనింగ్ మాఫియా…ఇలా గత ఐదేళ్లలో జేసీ బ్రదర్స్ ఆవినీతి, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో జేసీ బ్రదర్స్ అందినకాడికి దోచుకుంటూ..యధేచ్ఛగా చెలరేగిపోయారు. నియోజకవర్గంలో ఆఖరికి చికెన్ షాపుల దగ్గర కూడా కిలో చికెన్ అమ్మితే 20 రూపాయల పర్సంటేజీ పేరుతో జే ట్యాక్స్ వసూలు చేశారంటూ…తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు..ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒక కమెడియన్‌ను తలపిస్తున్నాడంటూ సెటైర్ వేశారు. గత ఐదేళ్లు బాబుకు బంట్రోతుగా పని చేసిన జేసీ..ఇప్పుడు బీజేపీని నెత్తిన పెట్టుకుని మోసే ప్రయత్నం చేస్తున్నాడంటూ.. ఎద్దేవా చేశారు.
గత ఐదేళ్లలో చేసిన అక్రమ మైనింగ్‌లు, ఇతర అక్రమాల నుంచి తప్పించుకునేందుకే జేసీ.. ఇప్పుడు జగన్ మా వాడు..అంటూ వంద రోజుల పాలనను పొగుడుతున్నాడని కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ ఎంత పొగిడినా మా నాయకుడు జగన్ కనీసం వాచ్‌మెన్ ఉద్యోగం కూడా ఇవ్వడని చురకలు అంటించారు. గత ఐదేళ్లు జేసీ బ్రదర్స్ నియోజకవర్గాన్ని దోచుకున్నారని, దేవాలయాల భూములు, ప్రజల అస్తులు కూడా వదల్లేదని, ఆఖరికి కిలో చికెన్‌కు 20రూపాయల పర్సేంటేజీని వసూలు చేశారంటూ కేతిరెడ్డి తీవ్ర వ్యక్తం చేశారు. నేను మాట్లాడిన వాటిలో ఏమాత్రం అవాస్తం ఉన్నా జేసీ బ్రదర్స్‌తో తాను బహిరంగా చర్చకు సిద్ధమని, తాను ఒక్కడినే వస్తానంటూ జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మొత్తంగా నరసరావుపేట, సత్తెనపల్లి కోడెల ఫ్యామిలీ చికెన్ షాపుల వద్ద వసూలు చేసిన కే ట్యాక్స్ తరహాలో తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ చికెన్ షాపుల దగ్గర కిలో చికెన్‌కు రూ. 20/- కమీషన్ కొట్టేసిన విషయాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయటపెట్టారు. మరి ఎమ్మెల్యే సవాల్‌పై జేసీ బ్రదర్స్ ఏమని స్పందిస్తారో చూడాలి..!