ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు అనుకున్నారు. కాని చివరి ధోని పొట్టి ఫార్మాట్ లో కప్ గెలిపించి, టీ20 గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ ను మొదటి స్థానంలో ఉంచాడు. 2007 లో ఇదే నెలలో జరిగిన మ్యాచ్ లలో ఇండియా కప్ గెలవడం పక్కన పెడితే ఈరోజు కు ఒక ప్రేత్యేక గుర్తింపు ఉంది. అదేమిటంటే..యువరాజ్ సింగ్ బ్యాట్టింగ్, ఇదే రోజున ఇంగ్లాండ్ పై ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి చరిత్రలో నిలిచాడు. అంతేకాకుండా ఇండియా కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.