పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్పేస్ట్లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్లో రకరకాల టూత్పేస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే
టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం వల్ల.. ప్రమాదకరమైన పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టూత్‌పేస్ట్‌లో ట్రైక్లోసన్ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. మనం బ్రష్ చేసినప్పుడు టూత్‌పేస్ట్ కాసింత కడుపులోకి వెళ్లినా.. అది పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేస్తుందంట..దీని వల్ల పేగు కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్ ఆమ్హెర్స్ట్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రఖ్యాత టూత్‌పేస్ట్ తయారీ కంపెనీలు ఈ ట్రైక్లోసన్ రసాయనాన్ని వాడకుండా ఉండలేరు. అందువల్ల టూత్ పేస్ట్ వాడిన వారికి పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్ట్‌లు అంటున్నారు. ఈ మేరకు ఎలుకలకు ట్రైక్లోసన్ తినిపించి పరిశోధనలు నిర్వహించగా, వాటిలో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) చనిపోయినట్లు తేలిందన్నారు. అంతే కాదు ఈ రసాయనం హర్మోన్ వ్యవస్థను దెబ్బతీస్తుందని జంతువులపై చేసిన పరిశోధనల్లో తేలిందట..ఇది ఆడ ఎలుకల్లో గర్భ విచ్ఛిత్తికీ కారణమైందని సైంటిస్టులు తేల్చి చెప్పారు. పిల్లలు ఆడుకునే బొమ్మల్లోనూ ఈ రసాయనాన్ని వాడుతారు. ఈ ట్రైక్లోసన్ భూతాపం కంటే అతి పెద్ద ప్రమాదం.. అని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా అమెరికాలో టూత్‌పేస్ట్‌ల తయారీలో ఈ ట్రైక్లోసన్ రసాయనంపై నిషేధం ఉన్నా మిగతా దేశాల్లో మాత్రం ఇంకా అమలు చేయలేదని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే ఈ ట్రైక్లోన్ రసాయనం సబ్బులు, టూత్పేస్ట్రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించిందని, ఇప్పటికీ దాదాపు 2 వేల ఉత్పత్తులలో వాడుతున్నారని, దీనివల్ల మరింత నష్టం జరగకముందే తక్షణ చర్యలు చేపట్టాలని సైంటిస్టులు అంటున్నారు. చూశారుగా..టూత్‌పేస్ట్‌తో పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు టూత్‌పేస్ట్ కొనేటప్పుడు ప్యాక్‌పై ట్రైక్లోసిన్ కెమికల్ ఉందో లేదో చూడండి..ఉంటే వెంటనే కొనడం ఆపేయండి.సహజసిద్ధంగా తయారైన ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లనే వాడండి..లేకుంటే శుభ్రంగా మళ్లీ వెనకటి కాలానికి వెళ్లిపోయి వేపపుల్లులు, బొగ్గును వాడండి..ఓకేనా..
Tags cancer cause chemical life style toot paste trycilosan