భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరో రికార్డు సృష్టిస్తుంది. 2020 ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న భారత తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రెజ్లర్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 53 కిలోల విభాగంలో జపాన్ క్రీడాకారిణి చేతులో ఓడిపోయింది. ఓడినప్పటికీ ఒలింపిక్స్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. తద్వారా భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళగా నిలిచింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒలింపిక్స్ లో సత్తా చాటి దేశానికి పతకం తీసుకురావాలని కోరుకుందాం.