తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం నేడు భేటీ కానుంది. ఈ నెల 27 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుంది. తొలుత ఈ నెల 26న సీఎల్పీ సమావేశం పెట్టాలనుకుంటున్నారు. అదే రోజు బీఎస్సీ ఉండటంతో ప్రీ పోన్ చేశారు. రుణమాఫీ, భారీ వర్షాలకు పంట నష్టం, గ్రేటర్ హైదరాబాద్లో రోడ్ల ధ్వంసం, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, దళితులకు మూడు ఎకరాలు, ప్రభుత్వ అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టబోతుంది సీఎల్పీ. ఇక అంతర్గత విషయాలకొస్తే రేవంత్ చేరికపై చర్చ జరిగే అవకాశం ఉంది.
