డ్రైవర్ లేకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నలబై కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఒక గూడ్స్ రైలు. రాజస్థాన్ రాష్ట్రంలో సెంద్రా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంద్రాకు చేరుకున్న గూడ్స్ రైలు డ్రైవర్ కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా వేగం అందుకున్న రైలు కదిలి నలబై కిలోమీటర్ల దూరం వెళ్లింది.
ఇది గమనించిన అధికారులు తర్వాత స్టేషన్లను అప్రమత్తం చేయడంతో సిబ్బంది పట్టాలపై ఇసుక బస్తాలను ,రాళ్లను పెట్టిన కానీ ఆగలేదు. అయితే అంత దూరం వెళ్లిన తర్వాత సోజాత్ స్టేషన్ కు చేరుకున్నాక రైలు దానంతట ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.