పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. సమంతతో వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ సినిమాలకు మంచి టాక్ రావడం.. ఓ బేబీ కమర్షియల్గా కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు సమంత వైపు చూపులు పడుతున్నాయి. అయితే ఇక ఫిట నెస్ విషయంలో సమంత చాలా కేర్ తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎంత వర్క్ ఉన్నా సరే ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి జిమ్ కు వెళ్తుంది. 15 నిముషాలు ముందుగానే సమంత జిమ్ లో ఉంటుందట. ఇక బయటకు వెళ్లే సమయంలో సామ్ తనతో పాటు బ్యాగ్ లో సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా తీసుకెళ్తుందట. సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు అడుగు పెట్టదట సమంత.