Home / NATIONAL / నా వయసు ఇంకా పదహారే..పీవీ సింధుతో పెళ్లి చేయండి సార్..?

నా వయసు ఇంకా పదహారే..పీవీ సింధుతో పెళ్లి చేయండి సార్..?

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ విజేత పీవీ సింధుకు  పెద్ద చిక్కు వచ్చిపడింది.ఏకంగా ఆరు పదుల వయసు  దాటిన వృద్ధుడు సింధుని పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడు. తనతో పెళ్లి చేయకపోతే ఏకంగా సింధును అపహరిస్తానని కూడా చెప్పాడు. కలెక్టర్ కు కూడా అర్జీ  కూడా పెట్టుకున్నాడు.

ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు చేసుకుంది. మలైస్వామి అనే వృద్ధుడు గ్రామ సభ కార్యక్రమంలో పాల్దొన్న కలెక్టర్ గారి మలై స్వామి వినతి పత్రం అందజేశాడు. సింధు ఆట తనని ఆకట్టుకున్నదని, తనకు ఎంతో నచ్చిందని తనతో పెళ్లి చేయాలని వినతి పత్రం అందజేశాడు. తన వయసు ఇంకా 16 ఏండ్లే అంటూ అందులో పేర్కొనటం గమనర్హం. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat