తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనతో టీడీపీ శ్రేణులు బాధపడుతున్నారు. అయితే కోడెల శివప్రసాద్ మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి జగన్ సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జగన్ వారి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఈక్రమంలో టీడీపీ దీనినికూడా రాజకీయాలకు వాడుకోవాలని చూడటం ఆపార్టీ శవరాజకీయాలకు నిదర్శనం.
ఒకపక్క కోడెల కుటుంబం శోకసంద్రంలో ఉంటే ఓదార్చి మిగతా కార్యక్రమాలు చూడవలసిన చంద్రబాబు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కోడెలపై తప్పుడుకేసులు పెట్టారు, అసెంబ్లీ దొంగగా చిత్రీకరించారు, కుటుంబాన్ని వేధించారు, అందుకే ఆత్మహత్య చేసుకొన్నారని జగన్ పై విమర్శలు చేసారు. కానీ వాస్తవానికి కనీసం ఒక్క కేసు కూడా ప్రభుత్వం పెట్టలేదు. పోలీస్ స్టేషన్ కి కూడా పిలవలేదు. అయినా చంద్రబాబు నాయుడు జగన్ పై విమర్శలు చేయడం సగటు టీడీపీ కార్యకర్తనే నివ్వెరపోయేలా చేసింది. ఇదిలా ఉంటే కోడెల మృతిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. అలాగే టీడీపీ ఎన్ని విమర్శలు చేసినా జగన్ తన గుణాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రయలు చేపట్టాలని సీఎస్ ను ఆదేశించారు. దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూడాలని అధికారులను ఆదేశించారు.