తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు.
అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. లాంచీలకు అనుమతులు ఎప్పుడిచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు బోట్ల పరిస్థితి ఏంటి.? ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కంట్రోల్ రూమ్స్ ఇప్పటివరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగారు. వారంరోజుల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటులో పోలీసు, ఇరిగేషన్, టూరిజం విభాగాలను భాగస్వామ్యం చేయాలన్నారు. బోట్లకు ఎప్పుడు అనుమతివ్వాలో ఇరిగేషన్ అధికారులు గుర్తించాలన్నారు. ప్రతీనెలా ఫిట్నెస్ తనిఖీలు చేయాలని, రాష్ట్రంలోని అన్ని పర్యాటక బోట్ల స్థితిగతులపై సమీక్ష జరపాలని ఆదేశించారు. ఉన్నపళంగా రాష్ట్రంలోని అన్ని లాంచీల అనుమతులు రద్దుచేశారు. ఫిట్నెస్ పరీక్షలు పూర్తైన తరువాతే అనుమతులు ఇవ్వాలన్నారు.