టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన్ను.. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే కోడెల మృతిని ఆస్పత్రి వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే గుండెపోటుతోనే కోడెల కన్నుమూసినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు కుటుంబ ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం.
మరోవైపు కోడెల గుండెపోటుతోనే ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వమే ఆయనను అవమానించగా అవమాన భారంతో కోడెల చనిపోయారని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. దీనికి మంత్రి బొత్స సమాధానమిచ్చారు.. ఒక్కరోజు కూడా కోడెలను ప్రభుత్వం విచారించలేదని, ప్రభుత్వం ఒక్క కేసుకూడా కోడెలపై పెట్టలేదన్నారు. కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలే ఆయనపై కేసులు పెట్టారని, కేట్యాక్స్ వసూళ్లపై బాధితులే ఆయనపై ఫిర్యాదులు చేసారని తెలిపారు. అయినా ప్రభుత్వం కోడెల పై అన్ని కేసులు ఉన్నా కనీసం పోలిస్ స్టేషన్ కూడా పిలవలేదన్నారు. ఆయనను అరెస్ట్ చేయలేదన్నారు. ముఖ్యంగా ఎల్లో మీడియా చంద్రబాబు డైరెక్షన్ లో తప్పులన్నీ కోడెలపై తోసారన్నారు.