కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి.
యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు.
ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” దేశంలో ఇటీవల నిరుద్యోగ సమస్యపై పలువురు తమకు తోచినట్లుగా వ్యాఖ్యలు ,విశ్లేషణలు చేస్తున్నారు” . అయితే వాస్తవానికి రిక్రూటర్లకు అవసరమైన యువత..ప్రజల్లో నైపుణ్యాలు,సత్తా లేవు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.