తాజాగా మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి ప్రెస్మీట్ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.. పవన్ ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా పవన్ చేసిన వ్యవహారాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన్ వందరోజుల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు.. అలాగే తాను పోరాటయాత్రలో ఉన్నప్పుడు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులకు టాయిలెట్లు లేవని ఆడపిల్లలకు కనీస సౌకర్యాలు లేవని తనకు చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు.
ఇంత వరకు బాగానే ఉన్నా వందరోజులు పాలనలో ఇప్పటికే అనేక వందలకోట్ల నిధులు సంక్షేమానికి కేటాయిస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పోతున్న జగన్ పై పవన్ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇప్పటికి కూడా చాలా ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు లేక పోవడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం.. అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడూ ప్రశ్నించని పవన్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడిచిన వెంటనే స్కూల్లో సదుపాయాలు, సౌకర్యాలు అంటూ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అందరూ విమర్శిస్తున్నారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబుకు మేలు చేసే రాజకీయాలు మాని నిజమైన రాజకీయాలు చేయాలని సరైన విమర్శలు, నిర్ణయాత్మక విమర్శలు చేయాలని సూచిస్తున్నారు.