ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఇప్పుడు ఉపసంహరించారు. అయితే ఈ కేసులను ఎత్తివేయాలనే ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధనకు వైయస్ జగన్ సారధ్యంలో ఐదేళ్లపాటు అనేక పోరాటాలు చేశారు. ఆసమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించింది.
ఎంతోమందిని ఇబ్బందులకు గురిచేసింది. అయితే జగన్ సీఎం కాగానే హోదా ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు అయిన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీమేరకు కేసులు ఉపసంహరించుకోవడంతో ఉద్యమకారులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారని, కానీ జగన్ మొదటి నుంచి కూడా హోదాపై పోరాటం చేస్తున్నారు. సీఎం కాగానే ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రత్యేక హోదా డిమాండును ప్రధానికి వినిపించారు. ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటానని జగన్ హామీఇచ్చారు.