‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది చలో ఆత్మకూరుకు అనుమతిలేదని చెప్పబోయిన పోలీసులపై వీరంగం చేసారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. ఈ క్రమంలో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్‌ను ‘యూజ్లెస్ ఫెలో’ అంటూ తిట్టారు.
మరోవైపు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజ కుమారి కూడా దళిత మహిళా ఎస్ఐ అనూరాధను కులం పేరుతో తిడుతూ ‘దళితుల వల్లే ఈ దరిద్రం’ అన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా టీడీపీ నాయకులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం వద్ద అచ్చెన్న హైడ్రామా నడిపాయి. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. కానీ ఎటువంటి దీక్షా చేయలేదు. చంద్రబాబు నివాసం బయట కరకట్ట రోడ్డుపై మాజీమంత్రి అచ్చున్నాయుడు పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగి గొడవ చేసారు. మోటార్ సైకిల్‌పై చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన్ను పోలీసులు ఆపి 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున లోనికి వెళ్లకూడదని చెప్పగా దీంతో రెచ్చిపోయిన అచ్చెన్న బిగ్గరగా అరుస్తూ తనకు రూల్స్ చెప్పొద్దంటూ పోలీసులను నెట్టేసారు. బందోబస్తు విధుల్లో ఉన్న విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్ అచ్చెన్నను నిలపగా ‘ఎక్స్‌ట్రాలు’ చేయొద్దని వేలుచూపిస్తూ బెదిరించారు. వెనక్కి వెళ్లాలని సర్దిచెబుతున్నా వినకుండా విక్రాంత్ పాటిల్‌ను ‘యూజ్లెస్ ఫెలో. నన్ను ఆపడానికి నీకెవడిచ్చాడు అధికారం’ అంటూ దుర్భాషలాడారు.
దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వ్యానులో ఎక్కించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అలాగే ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఫిర్యాదుమేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు. వైసీపీ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళంజిల్లా టెక్కలి పీఎస్ లో స్టేషన్లో కేసు నమోదైంది. ఇలావుంటే అచ్చెన్నకు అంత వయసు వచ్చింది కానీ బుద్ధి బుర్రలేదని ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అందుకే గతంలో ఏకంగా అసెంబ్లీలోనే అప్పడు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్, కొడాలి నానిలు ఎద్దులా పెరిగావ్ బుద్ధి లేదు అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక కూడా ఇవే మాట అన్నారని చెప్తున్నారు. అచ్చెన్న అసెంబ్లీలో కూడా జగన్ ని ఉద్దేశించి నువ్వు మగాడివైతే వంటి దారుణమైన పదాలతో దూషించిన విషయం తెలిసిందే.