తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా నేడు తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సౌందర్ రాజన్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. డాక్టర్ నుంచి గవర్నర్‌గా ఎదిగిన సౌందర్ రాజన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
డాక్టర్ నుంచి గవర్నర్ వరకు ఎదిగిన తమిళసై ప్రస్థానం
****************************************************
– స్వస్థలం : నాగర్ కోయిల్
– తల్లిదండ్రులు : కుమారి ఆనందన్ ( కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ)
– విద్యార్హతలు : ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీ, చెన్నై
– భర్త : సౌందర్ రాజన్ (ఈయన కూడా డాక్టరే)
– వృత్తి : డాక్టర్- ఎంబీబీఎస్ చదువుతూనే విద్యార్థి సంఘం నేతగా క్రియాశీలక పాత్ర
– బీజేపీ సిద్ధాంతాలతో ఆకర్షితురాలై ఆ పార్టీలో చేరిక
– 2007లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తమిళిసై సౌందర్ రాజన్
– 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమాకం
– 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎంపిక
– ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలి పదవిలో సౌందర్ రాజన్
– ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించని తమిళ సై
– రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినా ఓటమి
– 2006లో రాధాపురం అసెంబ్లీ స్థానంలో పరాజయం
– 2009లో చెన్నై నార్త్ లోక్‌సభ స్థానంలో ఓటమి
– 2011లో వేలచేరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసినా విజయం దక్కలేదు.
– 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకూడి ఎంపీ స్థానానికి పోటీచేసి మరోసారి ఓటమి పాలైన సౌందర్ రాజన్
– 2019, సెప్టెంబర్ 1 న కేంద్రంచే తెలంగాణ గవర్నర్‌గా నియామకం
– 2019, సెప్టెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం.