టాలీవుడ్ లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై చాలా కోపంగా ఉందట. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరితో కలిసి నటించింది. అంతేకాకుండా జనతా గేరేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఇది పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. అయితే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కి ముందుగా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. ఆమె ఈ స్పెషల్ సాంగ్ కి గాను 2కోట్లు అడిగింది. దీంతో కాజల్ కు బదులుగా బాలీవుడ్ నటిని ఎంచుకున్నారు. తనని కాదని వేరే నటిని తీసుకోవడంతో ప్రభాస్ పై కోపంగా ఉందని తెలుస్తుంది.