నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తొలిసారిగా ఎలిమినేషన్ కు ఎంపిక అయినప్పుడు బాబా భాస్కర్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ కాకూడదని బిగ్ బాస్ అభిమానులు బాబా భాస్కర్ కు ఓటు వేయాలని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కామెడీ చేస్తూ నవ్వించే బాబా భాస్కర్ సీరియస్‌గా మారాడు. ఎందుకంటే..? అతనికి కెప్టెన్సీ వచ్చేసింది. కెప్టెన్‌గా బిగ్‌బాస్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే కెప్టెన్ అయిన తర్వాత బాబా మాస్టర్ మాట్లాడుతూ.. తనకు కెప్టెన్ కావడం ఇష్టం లేదని.. కాకుంటే టాస్క్‌లో తన బెస్ట్ ఇవ్వాలని కష్టపడతాడని తెలిపాడు. కెప్టెన్ అయ్యి వారిని వీరిని అజమాయిషీ చేయాలని తనకు లేదు అంటూ బాబా మాస్టర్ అన్నాడు. ఇకపోతే.. తాజాగా జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌కి ఇంటి సభ్యుల తోడవడంతో బాబా ఇంటి కెప్టెన్‌గా గెలిచారు. ఇక్కడే శ్రీముఖి నిజ స్వరూపం బయటపడింది. కెప్టెన్ పోటీదారుగా ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ గెలిచినపుడు కంగ్రాట్స్ చెప్పింది. బాబా భాస్కర్ని సపోర్ట్ చేసిన శిల్పా చక్రవర్తితో ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను బాబా భాస్కర్‌కి ఇవ్వనంటూ ఆయన మొహం మీదే చెప్పింది. బాబా భాస్కర్‌తో స్నేహంగా మెలిగే శ్రీముఖి ఇలా మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి డబల్ స్టాండర్డ్స్‌తో గేమ్ ఆడుతుందని టాక్ వస్తోంది. ఇంకా హౌస్‌లో తెగ ఇంగ్లీష్ మాట్లాడేస్తుందని.. అది ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తుందని కూడా టాక్ వస్తోంది.