తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు.
‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది..
ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత తీసుకుంటా’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ గ్రామాన్ని గంగదేవిపల్లికి ధీటుగా తీర్చిదిద్దాలని.. అభివృద్ధిలో అన్ని గ్రామాల వారు పోటీ పడాలని సూచించారు.