రాజస్తాన్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే సరికొత్తదని చెప్పవొచ్చు. ఇదివరకే మోటార్ వాహనం చట్టంలో భాగంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా వేసి ఆ డబ్బుతో వారికే హెల్మెట్ ఇవ్వాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇకపై ఏ వాహనంపై అయినాసరే కులం, గ్రామం పేరు, పార్టీ పేరు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం అధికార ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం మనుషుల మధ్య కులతత్వం, విబేధాలు పెరుగుపోతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ మేరకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోలీసులకు ఆర్డర్ పాస్ చేయడంతో ఇకపై ఏ వాహనం పై కూడా కుల, మత, సంస్థల పేర్లు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు.
Tags caste cm government paty names police RAJASTHAN strict orders
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023