తమిళనాడు లోని పోలీస్ స్టేషన్లలో కొత్త రూల్స్ రానున్నాయి. అదేమిటంటే స్టేషన్ కి వచ్చే విజిటర్స్ కి డ్రెస్ కోడ్ ఉండాలని నిర్ణయించారు. లుంగీలు, నైటీలు, షార్ట్ లతో స్టేషన్ లోనికి రాకుడదని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రభుత్వ ఆఫీస్ అని అన్ని ప్రభుత్వ ఆఫీసులను ఎలా పరిగణిస్తారు దీనిని కూడా అలానే చూడాలని అన్నారు. కాని ఇందులో ఇంకొక విషయమేమిటంటే లాడ్జిలో దొరికే విటులు లుంగీలు, నైటీలు వేసుకుంటారు. దీనిపై తిరుపూర్ కమీషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..ఇది కచ్చితంగా చెయ్యల్సింది కాదని.. ముఖ్యంగా రౌడీలకు సంభందించే ఈ రూల్ పెట్టడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ లేబర్స్ ఉంటారు, అటు కలెక్టర్ సమావేశానికైనా లేదా ఇంకేదైనా మీటింగ్ లు జరిగిన ఇలానే లుంగీలు, నైటీలు, షార్ట్ లతో వెళ్ళడం వారికి ఒక అలవాటుగా మారిపోయింది. దీంతో వీటిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
