హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో మండల, జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.. అనంతరం ఈ ప్రణాళిక లక్ష్యాలు, ఉద్దేశ్యాలను కేసీఆర్ వారికి వివరించారు. ఈ నేపథ్యంలో పంచయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రజలు గ్రామాల అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…గ్రామాల అభివద్ధిని ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళ్ళాలి.కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పతిష్టాత్మక కార్యక్రమం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అన్నారు .గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను, విధులను ప్రభుత్వం కల్పించింది.గ్రామ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నా. ఇలా హాజరైన వారికే గ్రామానికి అవసరమైన వాటిని అడిగే హక్కు ఉంటుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిస్వార్థంతో పని చేయాలి. అది ఎన్నో తరాల వరకు ఉంటుంది.సీఎం కేసీఆర్ తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలే దానికి ఉదాహారణ అని ఆయన తెలిపారు.అన్ని గ్రామాలు స్వచ్చంగా, శుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడాలి.ప్రతి గ్రామానికి వార్షిక, ఐదేళ్ల ప్రణాళికను రూపొందించాలి.సఫాయి కర్మచారుల వేతనాన్ని సీఎం కేసీఆర్ 8500లకు పెంచారు. గతంలో వీరికి వెయ్యి, 1500 మాత్రమే వచ్చేదని మంత్రి వివరించారు. పారిశుధ్య నిర్వహణకు త్వరలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వబోతున్నాం అని తెలిపారు.