Home / ANDHRAPRADESH / ముగిసిన ఏపీ కేబినేట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ముగిసిన ఏపీ కేబినేట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం టెండర్లు నవయుగ సంస్థకు ఇచ్చినవి రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనం పదివేలకు పెంచుతూ ఆమోదముద్ర ముద్ర వేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పెళ్లిరోజే వైయస్సార్‌ పెళ్లి కానుకను అందించనున్నారు. మొత్తంగా రూ.746.55 కోట్లు ఏడాదికి ఖర్చు చేయనున్న ప్రభుత్వం.. ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు.. ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ. 1లక్ష పెంపు, బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50వేలు పెంపు, మైనార్టీలకు రూ. 50వేల నుంచి రూ.1 లక్ష పెంపు, వికలాంగులకు రూ.1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలు పెంపు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.2వేల నుంచి రూ.1లక్షకు పెంపు. ఆంధ్య్రాబాంకు విలీనంపై చర్చించిన రాష్ట్ర కేబినెట్‌ భోగరాజు పట్టాభిసీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్‌ డిమాండ్‌.. ప్రధానికి సీఎం లేఖరాయాలని నిర్ణయించిన కేబినెట్‌ నిర్ణయం.. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం. సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునేవారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం.. అలాగే ఇసుక రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక ధర రూ.375లుగా నిర్ణయం, అక్కడ నుంచి రవాణా ఖర్చు అదనం.. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90లు రవాణా ఖర్చు.. 10 కిలోమీటర్ల లోపు వరకూ ట్రాక్టర్ల ద్వారా రవాణా, రవాణా ఖర్చు రూ.500 ఇవే కాక మరిన్ని ప్రజా ఉపయోగకర నిర్ణయాలకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat