తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు.
దీంతో రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఖాయమని ఆ పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవీ ఇస్తే నల్లగొండ బ్రదర్స్ గా పేరు గాంచిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల మొదలు నిన్నటి జెడ్పీ ఎన్నికల వరకు ప్రతీ ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బ తిన్న సంగతి విధితమే. దీంతో పార్టీ చీఫ్ తన సోదరుడు వెంకటరెడ్డికిస్తే పార్టీకి పూర్వవైభవం తీసుకోస్తామని మొదటి నుండి రాజగోపాల్ అంటున్న సంగతి కూడా తెల్సిందే. అయితే తాజాగా ఆ పార్టీలో నెలకొన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వీరు పార్టీ మారడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు..