ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది. విదేశాల్లో ఉన్న నాగ్.. ఈ వీకెండ్‌కు అందుబాటులో లేకపోయేసరికి హోస్ట్‌గా రమ్యకృష్ణను బిగ్‌బాస్ బృందం రంగంలోకి దించింది. అయితే రమ్యకృష్ణ హోస్టింగ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వారంలో ఎలిమినేషన్‌లో ఎవ్వరు బయటకు రాలేదు దీంతో నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. వారం అంతా కష్టపడి ఓట్లు వేసిన ప్రేక్షకుల గురించి ఆలోచించరా.. ఆడియెన్స్ అంటే అంత చులకనా?, పనీపాటా లేకుండా ఓట్లు వేశామా? అంటూ బిగ్‌బాస్‌ను నిలదీస్తున్నారు. ఎలిమినేషన్ లేదంటే.. ఆ విషయాన్ని ముందుగానే ప్రేక్షకులకు తెలియజేయాలని, ఆడియన్స్‌ను గౌరవించడం తమిళ బిగ్‌బాస్‌ను చూసి నేర్చుకోవాలని చురకలంటిస్తున్నారు.
