తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది.
అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను కానుకగా ఇస్తోన్న సంగతి కూడా తెల్సిందే. అందులో భాగంగా ఈ సారి కూడా పెద్దమొత్తంలో చీరెలను అందివ్వాలని సర్కారు నిర్ణయించింది. అందుకే సిరిసిల్లలోని నేతన్నలకు దాదాపు వంద డిజైన్లతో మొత్తం 1.02కోట్ల చీరలను తయారీకి ఆర్డర్ ఇచ్చింది సర్కారు. ఇప్పటికే నేతన్నలు తయారు చేసిన యాబై లక్షల చీరెలను ఆయా జిల్లాలకు సరఫరా చేసింది .
2017లో 95.48లక్షల చీరెలను పంపిణీ చేయగా.. గతేడాది అంటే 2018లో 99.02లక్షల చేనేత చీరెలను ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కానుకగా అందించారు. తాజాగా 1.02కోట్ల చీరెలను ఆడబిడ్డలకు అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం మొదలైనాటి నుండి ఇప్పటివరకు సిరిసిల్లలో రూ.1,600కోట్ల విలువ చేసే 40.50కోట్ల మీటర్ల వస్త్రాలను ఆర్డర్లు సిరిసిల్ల వాళ్లకు ఇచ్చారు. దీంతో గతంలో ఈ వృత్తిని వదిలెళ్ళిన వారు తిరిగోచ్చి మరి మరమగ్గ వృత్తివైపు మళ్లుతున్నారు. సిరిసిల్లలో ప్రతి నేతన్నకు చేతినిండ పని దొరకడంతో వాళ్ల జీవితాల్లో వెలుగులు కురుస్తున్నాయి.