తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్ గెస్ట్చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్ అయినా.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశారు. చివరకు అవే నిజమయ్యాయి. మొదటిసారిగా ఓ మహిళా బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది. దీంతో ఈ వీకెండ్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదని మరో టాక్ వినిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో చూడాలి.