నారావారి పుత్రరత్నం లోకేష్ ఇవాళ మందలగిరిలో సారీ…మంగళగిరిలో ఓ రేంజ్‌లో కామెడీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉందంటూ…. ఈ రోజు మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి పాత బస్టాండ్ వద్ద భవన నిర్మాణ రంగ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించాడు లోకేషం. ఈ భవన నిర్మాణ కార్మికులందరికీ టీడీపీ నేతలు ఫ్లకార్డులు పంచి నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా లోకేష్ పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులుగా మార్చేశారంటూ తనదైన స్టైల్లో డైలాగ్ వేశారు. ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగిందంటూ గగ్గోలు పెట్టాడు. అమరావతిలో పనులు నిలిచిపోవడంతో వేల మంది ఉపాధి కోల్పోయారంటూ లోకేషం అక్రోశం వెళ్లగక్కాడు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలంటూ లోకేషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అయితే ఈ ధర్నాలో ప్రదర్శించిన ఫ్లకార్డులపై ఇసుకాసుర, భస్మాసుర అంటూ నినాదాలు రాయడం చూసి మంగళగిరి ప్రజలు నవ్వుకుంటున్నారు.
అసలు చంద్రబాబు హయాంలో పట్టణాలు, పల్లెలని చూడకుండా ఇసుక దోపిడీ చేసి కోట్లు వెనకేసుకుంది మీ టీడీపీ నేతలు కాదా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇసుకను మింగిన ఇసుకాసురులు, భస్మాసురులు నువ్వు, మీ బాబు కాదా అంటూ లోకేష్‌పై మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇసుకపాలసీ రూపొందించి ప్రజలందరికీ ఉపయోగపడేలా చేయాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణాను అదుపు చేసి, ఇసుక సరఫరాను నియంత్రించింది. దీంతో ఇసుక సరఫరాలో కృతిమ కొరత సృష్టించి టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఇసుక పాలసీతో సామాన్యుడికి ఇసుకను అందుబాటులో ఉంచాలని జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించేది పోయి..ఇలా నీ నీచ రాజకీయం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతో ఇలా ధర్నా చేస్తావా..అంటూ మంగళగిరి ప్రజలు లోకేష్‌పై మండిపడుతున్నారు.
అయినా ఇసుకాసురులు, భస్మాసురులు ఎవరో ఏపీ ప్రజలకు తెలియదా…ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఇసుకాసురుడు మీ చింతమనేని కాదా…న్యాయం చేయమని వచ్చిన వనజాక్షినే తప్పుపట్టి, చింతమనేనిని వెనకేసుకువచ్చిన నీ బాబు భస్మాసురుడు కాదా.. చిత్తూరు జిల్లాలో ఇసుకదందాలో ప్రజలను ఇసుకతో తొక్కించి చంపింది..మీ టీడీపీ నేతలు కాదా… అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇసుకాసురులు, భస్మాసురులు ఎవరో ఏపీ ప్రజలకు తెలుసుకాబట్టే..నిన్ను మంగళగిరి నుంచి, మీ బాబును ఏపీ నుంచి ప్రజలు తరిమికొట్టారు. అయినా సిగ్గు లేకుండా ఇసుకాసురులు, భస్మాసురులు అంటూ ధర్నా చేస్తున్నావా… నువ్వు నిజంగా మందలగిరి మాలోకానివే అంటూ…లోకేష్‌ను చూసి మందలగిరి ప్రజలు నవ్వుకుంటున్నారు.