వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరని. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమేని, అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబుని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధంకాకపోతే ఎవ్వరు ఏం చెయ్యలేరని అన్నారు. టీడీపీ ని జనం ఇంత దారుణంగా ఓడించిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదనే విషయం అందరికి తెలిసిందే, కాని ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరు. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమే. అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. @ncbn @naralokesh @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 29, 2019