ఏపీలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడో జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి .ఈ నేపథ్యంలో ఆర్టిస్టు శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలపై ఆరా తీశారు. వరదల్లో ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ ఆరా తీయగా మరో ముగ్గురి పేర్లు బట్టబయలు చేశాడు శేఖర్ చౌదరి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, సీతారామయ్య, శివయ్య అనే మరో ముగ్గురు నటుల పేర్లను చెప్పుకొచ్చాడు. దాంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని పోలీసుల విచారణలో శేఖర్ చౌదరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నెలవారీగా లక్షల్లో వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి తమను వాడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఇకపోతే రవిశేఖర్ చౌదరి వీడియోలకు అయ్యే ఖర్చును తెలుగుదేశం పార్టీ నేతలే అంటే నారా లోకేష్ మొత్తం సమకూరుస్తాన్నారని పోలీసుల విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి తెరవెనుక టీడీపీ భారీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోన్నారు. అందులో భాగంగానే పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని టీడీపీ తెరపైకి తెచ్చిందని ఆరోపించింది.
మరోపక్క సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్‌లు, పేటీఎం బ్యాచ్‌లు నడిపించి..ప్రభుత్వపై బురద జల్లించిన టీడీపీ సోషల్ మీడియాపై దేశంలోనే బలంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా తిప్పి కొడుతుంది. చంద్రబాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు. .దొంగే దొంగా..దొంగా అని అరిచినట్లు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేదింది కాకుండా…పెయిడ్ ఆర్టిస్టుల బ్యాచ్‌లతో …వైసీపీని నిందించడం బాబుగారికే చెల్లింది. అంతే కదా..బాబు మారడు..ఆయన బుద్ధి మారదు అంటున్నారు వైసీపీ అభిమానులు.
Home / ANDHRAPRADESH / నారా లోకేష్ టీమ్ గురించి పోలీసులు ముందు చెప్పిన పేయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి..మొత్తం ఎన్ని టీమ్ లో తెలుసా
Tags జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి నారా లోకేష్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ పోలీసులు