Home / ANDHRAPRADESH / ఏపీ బీజేపీ నేతలు టీడీపీకి మద్దతుగా మాట్లాడొద్దు.. సుజనా, కన్నాకు అక్షింతలు

ఏపీ బీజేపీ నేతలు టీడీపీకి మద్దతుగా మాట్లాడొద్దు.. సుజనా, కన్నాకు అక్షింతలు

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి ఒక్కసారిగా పెంచింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్నాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు మధ్య తేడా లేకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవి కిందిస్థాయిలో జరగడం లేదని, జగన్ వచ్చిన తర్వాత ఏపీలో మత మార్పిడులు ఎక్కువయ్యాయన్నారు. జగన్ తీరు మార్చుకోవాలని, లేకపోతే లేకపోతే రోడ్డెక్కాల్సి వస్తుందని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. అయితే కన్నా వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానానికి కూడా చేరాయి. జగన్ మత మార్పిడులను ప్రోత్సహించినట్టు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదు.. ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు. అయితే విమర్శలు పద్ధతిగా చేయకుండా ఇష్టానుసారంగా చేయడం పట్ల వైసీపీ మండిపడింది. ఓటుకు నోటు కేసుతో పాటు అనేక స్కాముల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దారుణంగా విమర్శించి మళ్లీ చంద్రబాబు మంచివాడు అనేలా టీడీపీనేతలు మాట్లాడడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఏపీలోని ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు రెండే.. ఒకటి అధికార వైసీపీ, మరొకటి టీడీపీ. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ ఒక్కసారిగా డీలా పడింది. ఆపార్టీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే సుజనా లాంటి నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇలాంటి నేతలతో ఆ పార్టీ వైసీపీకి ప్రత్యర్థిగా తయారవుతోంది. దీంతో క్రమంగా వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. మొదట్లో ఇదేదో కావాలని చేసినట్లు అనుకున్నా క్రమేపీ ఆ పరిధిదాటి విరోధులుగా మారుతున్నట్లు కనిపించింది. అందుకు కన్నా వ్యాఖ్యలే ఉదాహరణ. అయితే ఈ తాజా పరిణామాలతో బీజేపీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జగన్ విషయంలో బీజేపీ చీఫ్ కన్నాకు ఫోన్ చేసి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఏపీ బీజేపీ నేతలు ఎవరూ టీడీపీకి మద్దతుగా మాట్లాడొద్దని, బీజేపీపై చంద్రబాబు దుష్ప్రచారాన్ని మర్చిపోవద్దని సుజనాకు, కన్నాకు అక్షింతలు వేసారట.. వైసీపీ ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష బాధ్యతగా వ్యవహరించాలే తప్ప తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని పార్టీ అధిన్యాయకత్వం హెచ్చరించినట్టు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat