Home / ANDHRAPRADESH / ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైన బాబు..!

ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైన బాబు..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైయ్యారు. తాజాగా ఆశావర్కర్ల తరపున చంద్రబాబు నాయుడు కొన్ని ట్వీట్లు చేశారు. ఇటీవల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆశావర్కర్ల వేతనం రూ. 10,000/- లకు పెంచుతూ ప్రకటన చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ…చంద్రబాబు నాయకుడు ట్వీట్లు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు పెయిడ్ బ్యాచ్…పేటీయం బ్యాచ్ అంటూ చిల్లరగా మాట్లాడి పరువు పొగొట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వస్తే… ”ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేసాం అంటూ ఫోటోలకు ఫోజులా? మరో పక్క ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా? వాళ్ళ కష్టానికి గ్రేడ్ లు ఏంటి? చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు? ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? అంటే వాళ్ళను మీ ఇష్టానుసారం వేధించాలనేగా? ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. ఒక వేళ మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఆయుధం సిద్ధంగానే ఉందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క ఫోన్ కొట్టండి మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథ సృష్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది మామూలే కదా! అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ట్వీట్లపై నెట్‌జన్లు కౌంటర్లు ఇచ్చారు. మీ హయాంలో వేతనాలు పెంచమన్న అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆశావర్కర్లను పోలీసులతో నిర్ధాక్షిణ్యంగా లాఠీ చార్జీ చేయించావు..నువ్వు ఎప్పుడైనా చిన్న ఉద్యోగుల గురించి ఆలోచించావా…సీఎం జగన్ మంచి మనసుతో ఆశావర్కర్లకు వేతనాలు పెంచితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నావు. నువ్వు మారవు చంద్రబాబు అంటూ నెట్‌జన్లు ఓ రేంజ్‌లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసలు పెయిడ్ బ్యాచ్‌లు, పేటీఎం బ్యాచ్‌లు నడిపించి..ప్రభుత్వపై బురద జల్లించింది టీడీపీ సోషల్ మీడియా టీమ్ కాదా….మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషింపజేసి అడ్డంగా దొరికిపోయింది.. టీడీపీకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి కాదా.. అంటూ నెట్‌జన్లు బాబుపై సెటైర్లు వేశారు. .తాము తప్పులు చేస్తూ… వాటిని ప్రత్యర్థులు చేస్తున్నారంటూ ఎల్లోమీడియా చేత గగ్గోలు పెట్టించడం చంద్రబాబుకు అలవాటే..అందుకే పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం బ్యాచ్ అంటూ…టీడీపీ ఘన కార్యాలనే గుర్తు చేయడం విడ్డూరంగా ఉందంటూ నెట్‌జన్లు బాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు. .దొంగే దొంగా..దొంగా అని అరిచినట్లు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడిస్తూ, ప్రభుత్వాన్ని బద్నాం చేసేదింది కాకుండా…పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం బ్యాచ్‌లంటూ…వైసీపీని నిందించడం బాబుగారికే చెల్లింది. అంతే కదా..బాబు మారడు..ఆయన బుద్ధి మారదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat