Home / ANDHRAPRADESH / చంద్రబాబు గుండెళ్లో రైళ్లు…ముగ్గురు టీడీపీ నేతలపై సీబీఐ పంజా..ఎవ్వరు కాపాడాలేరంట

చంద్రబాబు గుండెళ్లో రైళ్లు…ముగ్గురు టీడీపీ నేతలపై సీబీఐ పంజా..ఎవ్వరు కాపాడాలేరంట

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో, వాటిని ఎలా కప్పిపుచ్చి వ్యవస్థలపై పెత్తనం చేసారో ఆధారాలతో సహా బయటపడుతోందంటున్నారు వైసీపీ నేతలు.

యరపతినేని శ్రీనివాసరావు:

కేంద్రం టీడీపీపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను మోడీ ప్రయోగిస్తున్నాడు బాబోయ్ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు బాగా గగ్గోలు పెట్టారు.. ఇంకే ముందు నన్ను జైల్లో పెట్టేస్తారు.. మీరే కాపాడుకోవాలి.. అంటూ సానుభూతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాపం.. జనం పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు నిజంగానే టీడీపీపై సీబీఐ పంజా విసరబోతున్నట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి సీబీఐ పంజా మొదటి పంజా ఓ టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై పడబోతోంది. ఆయనే.. గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు . ఆయన అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టు రాష్ట్ర సిఐడీ నిర్థారించింది. ఇందుకు నివేదిక రెడీ చేసింది. ఈ కేసును సీబీఐ కి అప్పజెప్పే విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఈ విషయాన్ని కోర్టు కూడా ఓకే చెప్పేసింది.

కోడెల శివప్రసాద్ :
నవ్యాంధ‌్రప్రదేశ్ తొలి స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. సత్తుపల్లిలో కోడెల కుటుంబం సాగించిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎవరూ కోడెల ఫ్యామిలీకి మద్దతుగా మాట్లాడడం లేదు.కోడెల ఫ్యామిలీ అవినీతి దందా టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బాబుగారి హయాంలో జరిగిన అవినీతి బాగోతాలపై సీఎం జగన్ విచారణ జరిపించేందుకు రెడీ అవుతుండడంతో బాబు, లోకేష్‌లతో పాటు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో కోడెల కుటుంబాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేసే విషయమై లోకేష్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

బోండా ఉమా.:
అధికారంలో ఉన్నాం క‌దా ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులు చేస్తె మ‌మ్మ‌ల్ను ఎవ‌రు ఏంచేయ‌లేరులే అని అనుకున్న టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. గ‌తంలోఐపీఎస్‌ అధికారి, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, బెదిరింపు కేసులో , రౌడియిజం , భూకభ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు – స్కామ్ లు – కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్నారని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో నేరాలకు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కారకుడుని వైసీపీ నేతలు అన్నారు. ఈ క్రమంలోనే బోండా ఉమ పై పలు ఆరోపణలు వచ్చాయి. అందుకే విజయవాడలో అత్యతం దారుణంగా రౌడియిజం చేశారని విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు విజయవాడలో ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. తన పలుకుబడితో ఆ భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఉమ కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరావు నగర కమిషనర్ కూడ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ భూ కబ్జా వ్యవహారంలో ఉమ బెదిరింపులకు పాల్పడతున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. దీంతో ఇప్పుడు జగన్ సర్కార్ టీడీపీ నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎది ఎమైన అటూ కేంద్ర..ఇటు రాష్ట్రంలో చంద్రబాబు..నేరాలకు పాల్పడ్డ మాజీ టీడీపీ ఎమ్మెల్యేలకు గుండెళ్లో రైళ్లు పరెగుడుతున్నాయంట టీడీపీ నేతలపై సీబీఐ పంజా ఎప్పుడో విసురుతోందో అని. అంతేకాదు ఈ సారి దొరికితే ఇక వాళ్లను ఎవ్వరు కాపాడాలేరంట

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat