తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ఎక్కువ వదలడం వల్లే లంక గ్రామాల్లో పంటలన్నీ ద్వెబ్బతిన్నాయన్నారు.దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీశైలం, సాగర్ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. పులిచింతలలో తొలిసారిగా 40 టీఎంసీల నీరు చేరింది. రాయలసీమను జలసిరి పలకరించింది. చంద్రబాబు మాత్రం శోకాలు పెడుతూ కృష్ణమ్మను నిందిస్తున్నారు. అమరావతి భూముల ధరలు ఢమాల్ అయ్యాయన్నదే ఆయన బాధ అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ గురించి ‘పవర్’ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు గారు ఒక్కసారి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. 1998 అక్టోబర్లో శ్రీశైలం కుడిగట్టు పవర్ హౌస్‌ను వరదనీటిలో ముంచి 500 కోట్ల నష్టం కలిగించారు. ఆ ఘటనపై విచారణ జరిగితే మీ బండారం బయట పడుతుంది.
శ్రీశైలం, సాగర్ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. పులిచింతలలో తొలిసారిగా 40 టీఎంసీల నీరు చేరింది. రాయలసీమను జలసిరి పలకరించింది. చంద్రబాబు మాత్రం శోకాలు పెడుతూ కృష్ణమ్మను నిందిస్తున్నారు. అమరావతి భూముల ధరలు ఢమాల్ అయ్యాయన్నదే ఆయన బాధ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 26, 2019
ఫ్లడ్ మేనేజ్‌మెంట్ గురించి ‘పవర్’ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు గారు ఒక్కసారి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. 1998 అక్టోబర్లో శ్రీశైలం కుడిగట్టు పవర్ హౌస్‌ను వరదనీటిలో ముంచి 500 కోట్ల నష్టం కలిగించారు. ఆ ఘటనపై విచారణ జరిగితే మీ బండారం బయట పడుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 26, 2019