టీమిండియా ఫాస్ట్ బౌలర్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా మరోసారి వెస్టిండీస్ ఆటగాళ్ళ పై విరుచుకుపడ్డాడు. బుమ్రా అంటే వన్డేలు, టీ20లే కాదు అని మరోసారి నిరూపించాడు. తన స్పెల్ కి సీనియర్ ఆటగాళ్ళు సైతం మెచ్చుకుంటున్నారు. ఇంక అసలు విషయానికి వస్తే తాను అడుగుపెట్టిన ఏ దేశంలో ఐన సరే మొదటి సిరీస్ లో ఇదు వికెట్లు తీస్తున్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో తాను ఆడిన మొదటి టెస్ట్ సిరీస్ లోనే ఈ ఫీట్ ని సాధించాడు. ఇప్పుడు మొదటిసారి అడుగుపెట్టిన వెస్టిండీస్ సిరీస్ లో అదే రిపీట్ అయ్యింది. బుమ్రా దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తాను ఇప్పటివరకు కేవలం 11మ్యాచ్ లే ఆడాడు. ఇంక ముందు ముందు రోజుల్లో మరెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాల్సిందే.