బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అలాగే జైట్లీ మృతికి తెలంగాణా సీఎం కేసిఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆరుణ్‌జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జాతికి ఎనలేని సేవ చేశారని, విలువలకు కట్టుబడిన వ్యక్తి అని జగన్ గుర్తు చేసుకున్నారు.
