Home / SLIDER / తెలంగాణలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పునర్వైభవం.

తెలంగాణలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పునర్వైభవం.

తెలంగాణలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పునర్వైభవం… పచ్చని, పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ‘ 60 రోజుల ప్రణాళిక’ అమలు కోసం అన్ని విధాలుగా సిద్థంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా అన్ని స్థాయిల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.
 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, పీఆర్‌ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి తదితరులతో మంత్రి దయాకర్‌రావు శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చర్యలు చేపట్టారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖకు వ్యవస్థాగతంగా బలోపేం చేయాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన పోస్టులను కొత్తగా మంజూరు చేయించారు. 1956 తర్వాత పంచాయతీరాజ్‌ శాఖలో ఒకేసారి 312 పోస్టులను కొత్తగా ఎప్పుడూ మంజూరు చేసిన దాఖలాలు లేవు. గ్రామాలపై, గ్రామీణ వికాసంపై సీఎం కేసీఆర్‌గారికి ఉన్న శ్రద్ధ వల్లే ఇది జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న అధికారుల పదోన్నతుల జాబితాను వేగంగా తయారు చేయాలి. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, ఎంపీవో, డీడీపీవో, ఎంపీడీవో, ఎంపీవో పోస్టులకు అర్హులైన అధికారుల జాబితాను సిద్ధం చేసి పదోన్నతులు కల్పించాలి. గ్రామ కార్యదర్శుల నుంచి పై స్థాయి వరకు అన్ని దశలలో పదోన్నతులు పూర్తి చేయాలి.
 
ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) మూడో దశ కింద తెలంగాణ రాష్ట్రానికి 2724 కిలో మీటర్ల కొత్త రోడ్లు మంజూరు అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకం కింద రూ.2 వేల కోట్ల నిధులు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి అవసరమైన ప్రతి చోట రోడ్డు మార్గం అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించాలి. దేశానికి ఆదర్శంగా నిలిచేలా మన రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నడుస్తోంది. గ్రామస్థాయిలో కచ్చితంగా 85 శాతం మొక్కలను బతికించేలా చర్యలు తీసుకోవాలి. హరితహారం విజయవంతం కోసం గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో హరితహారంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. గ్రామపంచాయతీల అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలను, దాతలను, ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయాలి. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండేలా ప్రణాళిక రూపొందించాలి. 2 వేల జనాభా, 5 వేల జనాభా, 10 వేల జనాభాకు అనుగుణంగా మూడు వేర్వేరు భవనాల నమూనాలను సిద్ధం చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీకార్యాలయాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనేది అంచనా వేసి నివేదిక ఇవ్వాలి.
 
గ్రామపంచాయతీ పాలకవర్గాల్లో కో–ఆప్షన్‌ సభ్యుల నియామకానికి మార్గదర్శకాలను ఖరారు చేయాలి. గ్రామపంచాయతీకి అనుగుణంగా అభివృద్ధి కమిటీల నియామక ప్రక్రియపైనా చర్యలు మొదలుపెట్టాలి. గ్రామాల్లో పరిశుభ్రత అనేది ముఖ్యం. పారిశుద్ధ నిర్వహణకు మంచి ప్రణాళిక ఉండాలి. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.600 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు త్వరగా విడుదలయ్యేలా కేంద్ర అధికారులపై ఒత్తిడి తెద్దాం. ఆగస్టు 26న కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఢిల్లీలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంపై అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రం తరుపున దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర విజయాలను వివరించేలా ఈ నివేదిక ఉండాలి’ అని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat