ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. బొత్సా సత్యనారాయణను వోక్స్ వ్యాగన్ కేసు వెంటాడుతూనే ఉంది. నాడు వైయస్సార్ కేబినెట్లో బొత్సా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో నోటీసులు జారీ అయ్యాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే వైయస్ సీబీఐ విచారణకు ఆదేశించారు. అందులో బొత్సాకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయినా..నాటి నుండి టీడీపీ రాజకీయంగా బొత్సా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు సీబీఐ కోర్టు వచ్చే నెల 12న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. సాక్షిగా బొత్సా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా రాజకీయంగా విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది.
