తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న కథనాలపై స్పందించారు..ఈ రోజు మీడియాతో అయన మాట్లాడుతూ.. నేను పార్టీ మారడంలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు .. టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. అన్ని విషయాలు చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చిస్తానని స్పష్టం చేసారు.. కాగా ఏపీలోని కొందరు మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ చంద్రబాబుకు ఏం వివరణ ఇస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది..