తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అర్ధ రహితంగా మారాయి. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అన్నయ్య దగ్గర లైసెన్స్డ్ పిస్టల్ ఉందని దాంతో కాల్చుకోవాలనుకున్నానని దాంతో ఇంట్లోవాళ్ళు భయపడి అన్నయ్య ముందుకు తీసుకెళ్లారని, ఆ సమయంలో అన్నయ ఇచ్చిన ఓదార్పుతోనే తాను బ్రతికున్నానని అందుకే తనకు అన్నయ్యంటే స్ఫూర్తి అన్నాడు పవన్.. అయితే అంతటితో ఆగలేదు.. ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే తనకు చాలా బాధేసిందంటూ అసందర్భ వ్యాఖ్యలు చేసాడు. పిల్లల తల్లిదండ్రులు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని హితువు పలికేసాడు.. మెగా అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున చిరంజీవి జన్మదిన వేడుకలు జరుగుతుండడంతో ఆనందంగా గడపాలనుకున్న అభిమానులకు నేను చచ్చిపోదాం అనుకున్నా.. తుపాకీతో కాల్చుకోవాలనుకున్నా అంటూ పవన్ చేసిన పిచ్చి వ్యాఖ్యలతో అందరూ ఖంగుతిన్నారు. శిఖరంలాంటి నటుడిగురించి మాట్లాడకుండా మెగా హీరోలతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని తన గురించి తన చావు, తుపాకుల గురించి మాట్లాడడం మెగాభిమానులకు నచ్చలేదు.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడినపుడు మాత్రం ఆయన అభిమానులు ఈలలతో గోలచేస్తూ సందడి చేసారు.