విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. అంతకముందు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గీతాగోవిందం. ఈ చిత్రంతో వీళ్ళ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే సినిమా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది. ఈ విషయం వీరిద్దరి చవిన పడింది. దీంతో స్పందించిన రష్మిక మా మధ్య ఉన్నది స్నేహమేనని ఎటువంటి ప్రేమా లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంకో చిత్రం తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. రెండు సినిమాలకే ప్రేమా అని చెబితే…ఇక మూడో సినిమా కూడా తీస్తే ఇంక పెళ్ళికి రెడీ అంటారేమో.